వీఆర్ఏల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త..క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని కేబినెట్ నిర్ణయం…

రాష్ట్రంలోని వీఆర్ఏల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. వీఆర్ఏల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించిన‌ట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు వెల్ల‌డించారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన తెలంగాణ కేబినెట్ స‌మావేశం దాదాపు మూడు గంట‌ల‌కు పైగా కొన‌సాగిన విష‌యం విదిత‌మే. ఈ కేబినెట్ భేటీ ముగిసిన అనంత‌రం ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, గంగుల క‌మ‌లాక‌ర్‌, ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డితో క‌లిసి హ‌రీశ్‌రావు కేబినెట్ నిర్ణ‌యాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.