వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ… సినిమా ఎలా ఉంది…. అసలు చూడొచ్చా..!!!

నటీనటులు: చిరంజీవి, రవితేజ, కేథరిన్‌ థ్రెసా, శ్రుతి హాసన్‌, ప్రకాష్‌ రాజ్‌, బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్‌, నాజర్‌, సత్యరాజ్‌, వెన్నెల కిషోర్‌, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి తదితరులు.

సాంకేతికత: ఛాయాగ్రహణం: ఆర్థర్‌.కె.విల్సన్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, కథ-మాటలు-దర్శకత్వం: బాబీ కొల్లి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని-రవిశంకర్‌, స్క్రీన్‌ ప్లే: కోన వెంకట్‌-చక్రవర్తి రెడ్డి-బాబీ కొల్లి.

మెగాస్టార్ చిరంజీవి ఈసారి రవితేజతో కలిసి వాల్తేరు వీరయ్య అనే మాస్ మసాలా సబ్జెక్ట్ చేశారు. బాబీ డైరెక్షన్ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎట్టకేలకు సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు నటించడం, సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్లాయి. అయితే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది అనేది రివ్యూలో తెలుసుకుందాం…

కథ…

వాల్తేర్‌ వీరయ్య (చిరంజీవి) వైజాగ్‌లో జాలరి కుటుంబం. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుని జీవించే వృత్తి. ఇలాంటి వ్యక్తి దగ్గరకు మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌.ఐ. (రాజేంద్రప్రసాద్‌) ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ స్మగ్లర్‌ అయిన సాల్మన్‌ సీజర్‌ (బాబీ సింహా)ను మలేషియానుంచి ఇండియా తీసుకురావడానికి సాయం కోరతాడు. వీరయ్య పెట్టిన కండిషన్లకు ఎస్‌.ఐ. ఒప్పుకుని తన బావమరిది వెన్నెల కిశోర్‌ను కూడా తీసుకుని వీరయ్య అతని అనుచరులతో మలేషియా వెళతారు. అక్కడ సాల్మన్‌ సీజర్‌ హోటల్‌లోనే వుంటూ అతని కదలికలు గమనిస్తూంటారు. ఈలోగా అందులో పనిచేసే రిసెప్షనిస్ట్‌ శ్రుతిహాసన్‌ తన టీమ్‌తో సాల్మన్‌పై ఎటాక్‌ చేస్తుంది. ఈ గందరగోళంలో వీరయ్య ఎవరు? అనేది తెలిస్తుంది. సాల్మన్‌ బ్రదర్‌ స్మగ్లర్‌ బాస్‌ ప్రకాష్‌రాజ్‌ కోసమే తను వచ్చానని అందరికీ వీరయ్య చెబుతాడు. వీరయ్యకు అంత పగ ఎందుకు? అనేది తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌తోపాటు మిగిలిన సినిమా చూడాల్సిందే.

అసలు స్టోరీ మొత్తం దీనిపైనే..
వాల్తేరు వీరయ్య’ కథ ఇంటర్‌నేషనల్ డ్రగ్‌ మాఫియాపై చిరంజీవి ఎక్కుపెట్టిన అస్త్రం. ఇలాంటి పాయింటే అంతకుముందు గాడ్‌ ఫాదర్‌ వచ్చింది. కానీ కథలోని బ్యాక్‌డ్రాప్‌లు తేడా అంతే. పైగా ఇందులో 20ఏళ్ళనాటి చిరంజీవి నటించిన కామెడీ, అమాయకత్వంతో ఎంటర్‌టైన్‌గా నడిపాడు. సీరియస్‌గా పోలీసు అధికారిగా రవితేజ చేశాడు. రవితేజ తన దాయాది తమ్ముడు. అతని ఆశయం వీరయ్య ఎలా నెరవేర్చాడు అన్నది పాయింట్‌. అందుకే చివర్లో ‘ఇలాంటి అన్నయ్య ప్రతి తమ్ముడికి వుండాలంటూ’ దర్శకుడు బాబీ ముగింపు కార్డ్‌లో చూపిస్తాడు.

పాత కొత్త కలయిక...

చిరంజీవి 20 ఏళ్ళ వెనక్కువెళ్ళి పాత సినిమాల బాడీ లాంగ్వేజ్‌, లుక్స్‌, డైలాగ్స్‌, కామెడీ టైమింగ్‌, బీడీ కాల్చడం వంటివి బాబీ అండ్‌ టీం చేసిన ప్రయత్నం కొంతమేర ఫలితాన్నిచ్చింది. మెగాస్టార్‌ అభిమానులైతే ఆయన పాత్రతో బాగానే కనెక్టవుతారు. ఈ దశలో ‘రౌడీ అల్లుడు’, ‘ముఠామేస్త్రి’ ఛాయలు కనిపిస్తాయి.

ఇక దర్శకుడిగా ఇంటర్‌వెల్‌ కార్డ్‌ బోయపాటి శ్రీను దర్శకత్వాన్ని తలపించేలా హింస వుంటుంది. రవితేజ అంటే అభిమానంతో తన మరదలి అయినా థెస్రా పోలీస్‌ స్టేషన్లో తన దగ్గర ఆశీర్వాదం కోసం వస్తోందని భావించి తన కోసం కాదని చేసే సన్నివేశం ఫన్‌ తెప్పిస్తాయి. రవితేజతో చిరు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి..

సినిమా అదిరిపోయిందని, చిరంజీవి డ్యాన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగున్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అదుర్స్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. ఫస్టాఫ్‌ ర్యాంప్‌, ఇంట్రో, బాస్‌ పార్టీ సాంగ్‌, కామెడీ, ఇంటర్వెల్‌ సీన్‌ ఆకట్టుకుంటాయి. సెకండాఫ్‌ యావరేజ్‌ అని, రవితేజ, చిరు మధ్య సీన్స్‌ బాగున్నాయని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.సెకండాఫ్‌లో రవితేజ వచ్చాకే కథలో కొంచెం సీరియస్నెస్‌ వస్తుంది. అన్నదమ్ముల మధ్య వచ్చే సీను, ఇద్దరి మధ్య ఎమోషనల్‌ బాండ్‌ మెప్పిస్తాయి. క్లయిమాక్స్‌లో ఆధ్యాత్మిక జోడిరచి రవితేజ పాత్ర ద్వారా చావు వస్తే ఆ ఛాయలు ఇట్టే తెలిసిపోతున్నాయనేది కూడా సీన్‌లో వెల్లడిస్తాడు. దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఓకే. ఎక్కువ రొదలు లేకుండా మాస్‌కు నచ్చేవిధంగా వున్నాయి. చిరు కోసం.. కామెడీ కోసం.. రవితేజతో చిరు కాంబినేషన్‌ సీన్ల కోసం ‘వాల్తేరు వీరయ్య’ చూడొచ్చు. విలన్‌ పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ రొటీన్‌ అనిపిస్తాడు. బాబీ సింహా బాగానే చేశాడు. మిగిలిన వారంతా పాత్రల పరిధిలో నటించారు.

సినిమాలోను ఇతర నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించాడు. శృతిహసన్ పాత్ర సినిమాలో కీలకం. కానీ జస్టిఫికేషన్ లేదేమో అనిపిస్తుంది. కేథరీన్ తనకు లభించిన లిమిటెడ్ సీన్స్ లో పర్వాలేదనిపించుకుంది. బాబీ సింహా విలన్ గా ఆకట్టుకున్నాడు. నిజానికి ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్. కానీ సరిగా ఎలివేట్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిగా బాగానే ఉన్నాయి.
ఖైదీ నెం.150” అనంతరం చిరంజీవి బెస్ట్ లుక్స్ & మ్యానరిజమ్స్ మళ్ళీ ఈ వీరయ్య పాత్రలోనే కనిపించాయి. అలాగే.. ఆయన అభిమానులు మిస్ అవుతున్న డ్యాన్సులు కూడా ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఇక యాక్షన్ బ్లాక్స్.. ముఖ్యంగా ఇంట్రడక్షన్ & ఇంటర్వెల్ బ్లాక్ ను డిజైన్ చేసిన తీరు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. అలాగే.. చిరంజీవి కామెడీ టైమింగ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.

దర్శకుడు బాబీ.. సింపుల్ రివెంజ్ స్టోరీతో.. అలరించే ప్రయత్నం చేశాడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా నడుస్తుంది. ఓవరాల్ గా చిరంజీవి సినిమా నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో.. అవి ప్యాక్ చేసి తీసుకొచ్చాడు దర్శకుడు. మాస్ ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారు.