వాట్సాప్ కాల్ రికార్డ్ చేయవచ్చా..!

ప్రస్తుత రోజుల్లో సాధారణ వాయిస్ కాల్స్ కంటే ఇంటర్నెట్ ఆధారిత వాట్సాప్ కాల్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఆఫీస్ అవసరాల కోసమో లేదా మరేదైనా ముఖ్యమైన సమాచారాన్ని దాచుకోవడానికో కొన్నిసార్లు వాట్సాప్ కాల్స్‌ను రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని మెటా సంస్థ వాట్సాప్ యాప్‌లో ఎటువంటి అధికారిక కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను అందించలేదు. అయినప్పటికీ ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న కొన్ని అంతర్గత ఫీచర్లు, ప్రత్యామ్నాయ ఆప్షన్ల ద్వారా ఈ కాల్స్‌ను సులభంగా రికార్డ్ చేసుకోవచ్చు.

మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఈ ఆప్షన్ ద్వారా వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయెచ్చు. ఇందుకోసం మీరు కాల్ మాట్లాడే ముందు ఫోన్ నోటిఫికేషన్ ప్యానెల్ నుంచి ‘ స్ర్రీన్ రికార్డర్ ‘ ఆప్షన్ ఆన్ చేయాలి.అలాగే ఆడియో సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ Mic లేదా System Sound సెట్ చేసుకుంటే చాలు ఆటోమెటిక్‌గా మీ కాల్ రికార్డ్ అవుతుంది. కాల్ అయిపోగానే రికార్డింగ్ ఆపిస్తే.. ఆడియో మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది…మ్యాక్‌బుక్ కనెక్షన్: ఒక వేళ మీరు ఐఫోన్ యూజర్ అయితే.. ఆపిల్ సెక్యూరిటీ రూల్స్ ప్రకారం నేరుగా రికార్డ్ చేయడానికి రాదు. కాబట్టి మీ ఐఫోన్‌ను కేబుల్ ద్వారా మ్యాక్‌బుక్‌కు కనెక్ట్ చేసి రికార్డు చేయొచ్చు. ఇందుకోసం QuickTime Playerలో ‘New Audio Recording పై క్లిక్ చేసి కాల్‌ను స్పీకర్‌లో పెట్టి మ్యాక్ ద్వారా రికార్డ్ చేయవచ్చు..అలా కాకుండా మరో ఆప్షన్ ఏదైనా ఉందంటే.. మరొక ఫోన్ లేదా వాయిస్ రికార్డర్ ద్వారా మీ వాట్సాప్ కాల్‌ను రికార్డ్ చేయవచ్చు. ఇందుకోసం మీరు వాట్సాప్ కాల్‌ను స్పీకర్‌లో పెట్టి, పక్కనే వేరే ఫోన్‌లోని వాయిస్ రికార్డర్ ద్వారా మీ కాల్‌ను రికార్డ్ చేయవచ్చు. ఇది చాలా సింపుల్‌ పద్దతి.. దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదు.