WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు..
మొబైల్‌కి ఆడియో స్టేటస్, డెస్క్‌టాప్‌కి అన్‌రీడ్ చాట్ ఫిల్టర్
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్లు.. మొబైల్‌కి ఆడియో స్టేటస్, డెస్క్‌టాప్‌కి అన్‌రీడ్ చాట్ ఫిల్టర్
: వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఎన్ని వచ్చినా.. తర్వాత ఏం ఫీచర్ రాబోతుందనే ఆసక్తి యూజర్లలో ఉంటుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో యూజర్లకు కొత్త ఫీచర్లను పరిచయం చేయడంలో వాట్సాప్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మల్టీడివైజ్, 2జీబీ ఫైల్ షేరింగ్, వాయిస్ మెసేజ్ ఎడిట్, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ టైమ్ లిమిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్, 32 మందితో గ్రూప్ కాలింగ్ అంటూ దాదాపు పదికిపైగా కొత్త ఫీచర్లు తీసుకొచ్చింది. కొత్తగా వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌లో మరో ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది.
వాట్సాప్‌లో ఇప్పటి వరకు ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్‌ను మాత్రమే స్టేటస్‌గా పెట్టుకునే వెసులుబాటు ఉండేది. త్వరలో రాబోతున్న ఫీచర్‌తో యూజర్లు తాము స్వయంగా రికార్డు చేసిన ఆడియో క్లిప్స్‌తోపాటు, ఇతరుల పంపిన లేదా రికార్డు చేసిన వాయిస్ నోట్స్‌ను వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ఆడియో స్టేటస్ అప్‌డేట్ కోసం యూజర్లు స్టేటస్ బార్ ఓపెన్ చేస్తే ప్రస్తుతం ఉన్న కెమెరా, టెక్ట్స్ పీచర్లతోపాటు కొత్తగా మైక్ సింబల్ కనిపిస్తుంది. మైక్ సింబల్‌పై క్లిక్ చేసి ఆడియో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని స్టేటస్‌లో అప్‌డేట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి వస్తుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) వెల్లడించింది.
డెస్క్‌టాప్ యూజర్ల కోసం
దీంతోపాటు డెస్క్‌టాప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో రోజుకి ఎన్నో మెసేజ్‌లు వస్తుంటాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ముందు చదివేస్తుంటాం. దాంతో అంతకుముందు వచ్చిన మెసేజ్‌లు అన్‌రీడ్‌గా కాంటాక్ట్ బార్‌లో కిందకు వెళిపోతాయి. వాటిని తిరిగి చదివాలంటే కాంటాక్ట్ బార్‌ను కిందకు స్క్రోల్ చేయక తప్పదు. ఇకపై ఆ అవసరం లేకుండా వాట్సాప్ అన్‌రీడ్ చాట్ ఫిల్టర్ (Unread Chat Filter) అనే ఫీచర్‌ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు అన్‌రీడ్ జాబితా కోసం కాంటాక్ట్ బార్‌లో సెర్చ్ పక్కనే ఉన్న సింబల్‌పై క్లిక్ చేస్తే మీరు చదవని మెసేజ్‌లు కనిపిస్తాయి.
నచ్చిన ఎమోజీతో రియాక్షన్
వాట్సాప్ ఇటీవల పరిచయం చేసిన మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను కూడా అప్‌డేట్ చేయనుంది. ఇప్పటి వరకు ఈ ఫీచర్‌తో యూజర్లు కేవలం ఆరు ఎమోజీలతో మాత్రమే రిప్లై ఇచ్చే వెసులుబాటు ఉంది. త్వరలో వీటికి అదనంగా వాట్సాప్‌లోని అన్ని ఎమోజీలను ఉపయోగించుకునేలా ఈ ఫీచర్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేయనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్ మెసేజ్ పక్కనే ఉన్న ఎమోజీ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఆరు ఎమోజీలతోపాటు ప్లస్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వాట్సాప్‌లోని ఏదైనా ఎమోజీతో మెసేజ్‌కు రిప్లై ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.