ఎండ తీవ్రత పెరగొచ్చు..!

వాతావరణ సమాచారం.

ఏండా తీవ్రత ఉదయం సమయం నుంచి మధ్యాహ్నం సమయం వరకు 37-38 డిగ్రీల ఉండచ్చు..

బంగాళాకాతం లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వలన రాత్రి సమయం లో దక్షిణ కోస్తా, జిల్లాలో 28,29,30 జులై 1,2,3 తేదీల వరకు వర్షాలు ఎక్కువగా నమోదు అవ్వవచ్చు..
ఇది ఇలా ఉండగా
నైరుతీ రుతుపవనాల విస్తరణతో రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. కొన్ని జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తుండగా, మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా, రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని, వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెళ్లడించారు.