పొలాల్లో సెల్‌ఫోన్లు వాడొద్దు: ఐఎండీ డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న…

భారీ వర్షం కురుస్తున్న తరుణంలో వాతావరణ శాఖ రైతులకు ఒక సమచారం అందించారు..
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పొలాల్లో సెల్‌ఫోన్లు వాడొద్దని రైతులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న సూచించారు. ఉరుములు, మెరుపులు బారిన పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. కరెంట్‌ స్తంభాలు, చెట్ల కింద నిలబడొద్దని, పొలాల్లో ఉన్నప్పుడు నేలపై కూర్చోవాలని సూచించారు. ఎత్తుగా నిలబడి ప్రయాణం చేయవద్దని కోరారు.