ఈనెల 11, 12 తేదీల్లో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ…

*నేడు అల్పపీడనం*

R9TELUGUNEWS.COM:

ఈనెల 11, 12 తేదీల్లో రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.

కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
“ఆగ్నేయ బంగాళాఖాతం, దాని సమీప ప్రాంతాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడి తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణించే అవకాశముంది..దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో సోమ,మంగళ వారాల్లో భారీ వర్షాలు కురవొచ్చు” అని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.