రానున్న రెండు రోజులు జాగ్రత్త…వేడిగాలులు ఇంకా పెరిగే అవకాశం..!!

వేడిగాలులు ఇంకా పెరిగే అవకాశం..!!

రానున్న రెండు రోజులు జాగ్రత్త…

గత నాలుగు రోజుల నుంచి ఏపీ తెలంగాణాలో నిలకడగా 42 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం మాత్రం 43 నుంచి 44 డిగ్రీల వరకు చేరింది.

వచ్చే రెండు రోజుల్లో అన్ని ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటకు రావొద్దని చెబుతున్నారు. వేడిగాలులు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.