రోజురోజుకు రాష్ట్రంలో పడిపోతున్నా ఉష్ణోగ్రతలు..

_రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి._

_వాతావరణంలో మార్పులకు తోడు చలిగాలుల తీవ్రత పెరగడంతో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి._

_రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు…

ఆగ్నేయం వైపు నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రివేళల్లోనే కాకుండా పగటి ఉష్ణోగ్రతలూ పడిపోతున్నాయని, రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని హెచ్చరించింది. రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించింది..కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం రాత్రి రాష్ట్రంలో అత్యంత కనిష్ఠంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలో 9.1, ఆదిలాబాద్‌లో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే మూడు రోజులు పరిస్థితి ఇలానే ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి తోడు పొగమంచు కూడా ఇక్కట్లకు గురిచేస్తోంది. శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో దట్టమైన పొగమంచు కారణంగా వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది…, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రోజువారి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 29.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15.6 డిగ్రీలుగా నమోదవుతున్నాయని పేర్కొంది. ఆదిలాబాద్‌లో 9.2, మెదక్‌ 11.6,రామగుండం 13.6, హకీంపేట్‌ 14.6, దుండిగల్‌ 14.7, నిజామాబాద్‌ 15.1, హనుమకొండ 15.5, హైదరాబాద్‌ 15.5, నల్లగొండ 16.2, మహబూబ్‌నగర్‌ 17.6, ఖమ్మం 19.0, భద్రాచలం 19.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..