రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు… హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం.

ఒక్కసారిగా వాతావరణం చల్లబడగా జనం ఉక్కపోత నుంచి ఊరట పొందారు. ఇదిలా ఉండగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది…జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, నేరేడ్‌మెట్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బేగంపేట, చిలుకలగూడ, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. కీసరలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురువగా.. ముందస్తు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టాయి… ఈ నెల 29న తేదీన కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మంగళవారం కేరళతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా, మరో రెండు మూడు రోజుల్లో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, కొంకన్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర పరిమితి కార్వార్, చిన్నమగళూరు, బెంగళూరు, ధర్మపురి మీదుగా వెళ్తున్నాయని తెలిపారు.