వరల్డ్ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్.. పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓటమి

వరల్డ్ కప్ రేసు నుంచి వెస్టిండీస్ ఔట్.. పసికూన స్కాట్లాండ్ చేతిలో ఓటమి

West Indies World Cup Qualifier : రెండు సార్లు ఛాంపియన్స్గా నిలిచిన వెస్టిండీస్.. వరల్డ్ కప్ 2023కి అర్హత సాధించలేకపోయింది. జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్స్లో స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదుర్కొని ప్రపంచ కప్ రేస్ నుంచి నిష్క్రమించింది.ఈ మెగా టోర్నీ రేసు నుంచి తప్పుకోవడం వల్ల.. వరల్డ్ కప్ సూపర్‌ సిక్సెస్‌లో ఇప్పటికే ఒక్కో మ్యాచ్లో గెలిచిన జింబాబ్వే, శ్రీలంక జట్లకు వరల్డ్ కప్ టాప్‌-10లో నిలిచేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. అయితే గ్రూప్ దశలో నెదర్లాండ్స్ చేతిలోనూ విండీస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా, ఇండియా తర్వాత.. ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ కప్ను ముద్దాడిన జట్టుగా నిలిచిన విండీస్కు.. ఈ విధంగా వరల్డ్ కప్ రేసు నుంచి నిష్క్రమించడం అవమానకరమే…తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. 43.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌట్‌ అయింది. కరేబియన్‌ జట్టులో జాసన్‌ హోల్డర్‌ 79 బంతుల్లో 45పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్కాట్‌లాండ్‌ బౌలర్లలో బ్రాండన్‌ మైక్‌ ములెన్‌ మూడు వికెట్లు తీశాడు. తర్వాత 182 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన స్కాట్‌లాండ్‌ 43.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది.