వాట్సప్ కొత్త ఫ్యూచర్..

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(whatsapp) తన వినియోగదారుల కోసం ఒక కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దాని పేరు ‘వాట్సాప్ చానల్’. దీని ద్వారా వివిధ రకాల కంటెంట్‌కు సంబంధించి సపరేట్ చానల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే, ఈ చానల్స్ నుండి ప్రాధాన్యతల ప్రకారం డేటా(data) పొందవచ్చు. దీనికోసం ‘Updates’ అనే కొత్త ట్యాబ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాబ్‌లో(tube users) యూజర్లు వివిధ రంగాలకు సంబంధించి.. షాపింగ్, కొత్త ప్రొడక్ట్స్(shopping product), స్పోర్ట్స్ల(sports) వివిధ రకాల అప్‌డేట్స్ కోసం చానల్స్‌ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ చానల్స్ ఫాలో అయ్యే యూజర్లు వాటికి సంబంధించిన అప్‌డేట్స్‌ను(updates) డైరెక్ట్‌గా ఆ చానల్స్ ద్వారా పొందుతారు. ఇది దాదాపు టెలిగ్రామ్ మాదిరిగా పనిచేస్తుంది.

అడ్మిన్‌‌లు తమ కంటెంట్‌ను ఏ రూపంలోనైనా పంపవచ్చు. టెక్స్ట్, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, పోల్‌లను పంపడానికి చానల్‌లు ఒక ప్రత్యేక సాధనంగా ఉంటాయి. చాట్‌లు, ఇ-మెయిల్, ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఆహ్వాన లింక్‌ల నుంచి కూడా వినియోగదారులు చానల్ పొందవచ్చు. ముఖ్యంగా తమ వ్యాపారాలు, ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవాలనుకునే వారికి ఈ కొత్త ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. వాట్సాప్ సర్వర్‌లలో చానల్ హిస్టరీని 30 రోజుల వరకు మాత్రమే స్టోర్ అవుతుంది. అడ్మిన్‌లకు పూర్తి కంట్రోలింగ్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొలంబియా(Columbia), సింగపూర్‌లో(Singapore) అందుబాటులో ఉంటుంది. రాబోయే నెలల్లో ఈ ఫీచర్ మరిన్ని దేశాల్లో అందుబాటులోకి రానుంది.