వాట్సాప్‌కు సుప్రీం చుర‌క‌లు..

ప‌్రైవ‌సీ పాల‌సీ విష‌యంలో సోమ‌వారం వాట్సాప్‌తోపాటు దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ జ‌రిపింది. నాలుగు వారాల్లో నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల‌ను ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఆ సంస్థ‌కు చుర‌క‌లు అంటించింది. . ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ జ‌రిపింది. నాలుగు వారాల్లో నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల‌ను ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఆ సంస్థ‌కు చుర‌క‌లు అంటించింది..ఇండియాలో వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేయకుండా ఆదేశించాలని ఆ పిటిషన్ కోరింది. యురోపియన్ యూనియన్‌లో అమలు చేస్తున్న పాలసీనే ఇక్కడా అమలు చేయాల్సిందిగా కూడా ఆ పిటిషన్ అభ్యర్థించింది.ఇక వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తరఫున కపిల్‌ సిబాల్‌, అరవింద్‌ దాతర్‌ తమ వాదనలు వినిపించారు. ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు…