వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు మెటా యాజామాన్యం ఒక శుభవార్త తెలిపింది…

R9TELUGUNEWS.COM. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు మెటా యాజామాన్యం ఒక శుభవార్త చెప్పనుంది. గ్రూప్‌లలో యూజర్ షేర్ చేసిన మెసేజ్‌లను గ్రూప్ అడ్మిన్‌లు డిలీట్ చేసేలా కొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. గ్రూప్ అడ్మిన్ మెసేజ్‌ని డిలీట్ చేసినట్లయితే, గ్రూప్‌లోని మిగిలిన వ్యక్తులకు ‘ఈ మెసేజ్ అడ్మిన్ ద్వారా తొలగించబడింది’ అని తెలుస్తుంది. భవిష్యత్ అప్‌డేట్‌లో ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. నకిలీ వార్తలను అరికట్టడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని రోజుల క్రితం, వాట్సాప్ ‘డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ కాలపరిమితిని పొడిగించే అవకాశం పై కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం, వినియోగదారులు పంపిన మెసేజ్‌ను 1 గంట, 8 నిమిషాలు 16 సెకన్ల తర్వాత మాత్రమే తొలగించగలరు. కానీ ఇప్పుడు, WhatsApp మెసేజ్ పంపిన 7 రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి వాటిని డిలీట్ చేసే ఆప్షన్‌ను అందించనుంది. భవిష్యత్ అప్‌డేట్‌లో కాల పరిమితిని 7 రోజుల 8 నిమిషాలకు మార్చుకోవాలని యోచిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.