కరోనా తగ్గుతున్న క్రమంలో..ప్రభావం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపోయేది కాదు..ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్…

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాని ప్రభావం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపోయేది కాదని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు…మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని, ముఖ్యంగా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న సమూహాల్లో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. వైరస్ ఎక్కువ కాలం ప్రబలితే దాని ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆయన తెలిపారు…కామన్‌వెల్త్ లోని జనాభాలో 42 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ రెండు డోసులు పొందారని, అదే ఆఫ్రికన్ దేశాలు సగటున 23 శాతం వ్యాక్సినేషన్ రేటును సాధించినట్టు ఆయన చెప్పారు. ఈ అంతరాన్ని తగ్గించడం ప్రపంచ ఆరోగ్య సంస్థ తక్షణ ప్రాధాన్యత అని చెప్పారు…