*వ్యాక్సిన్ వచ్చేసింది ఆన్ని సంబర పడుతున్నారా… ఇవి పాటించకుంటే వ్యాక్సిన్ వాడిన లాభం లేదు

కొన్నాళ్ళ వరకు మాస్క్, శానిటేజర్ వాడకం తప్పనిసరి…

వ్యక్తిగత దూరం కుడా….

ఇలా చెస్తే….4 నుండీ 6 నెలలో కరోనా మహమ్మారి అంతం అవుతుంది….!

ఓవైపు వ్యాక్సిన్ మరో వైపు బ్రిటన్ అమెరికాలో పెరుగుతున్న కేసులు ఈ నేపథ్యంలో.. 2021లోనే హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం అసాధ్యమని వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తగినన్ని డోసులను సిద్ధం చేయడానికి సమయం పడుతుందని ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ చెప్పారు. అంతవరకూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం అత్యంత అవసరం అని సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు….. అంతే కాకుండా…
 దేశ విదేశాల శాస్త్రజ్ఞులు కోవిడ్ నివారణకు టీకాను తీసుకొచ్చారు. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సినేషన్ ను ప్రారంభించాయి. తాజాగా భారత్ కూడా టీకా కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తోంది. దీంతో కొన్ని నెలల్లోనైనా కరోనా అదుపులోకి వచ్చేస్తుంది. ఇప్పటికే అమెరికా, యుకె , దుబాయ్ వంటి దేశాలు వ్యాక్సిన్ ఇస్తుండగా.. భారత్ లో ఈనెల 16 నుంచి టీకాను ఇవ్వనున్నారు. దీంతో అన్ని వైరస్ లానే కరోనా వైరస్ కూడా అంతమవుతుంది అని సంబరపడుతున్న ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. పలు దేశాల్లో టీకా కార్యక్రమం ప్రారమైనప్పటికీ అధిక రోగనిరోధక శక్తి సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.