వన్యప్రాణులతో సెల్ఫీలు దిగితే ఏడేండ్లు జైలుకే..!.

ఏడేండ్ల జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు ఒడిశా అటవీ శాఖాధికారులు.

చాలా మందికి సెల్ఫీలు అంటే చాలా ఇష్టం. ఫంక్షన్ అయినా, పెళ్లి అయినా, స్నేహితులతో కలిసినా చివరికి కొత్తగా ఏది కనిపించినా సెల్ఫీలు తీసుకుంటారు. అయితే చాలా మంది అనుమతి లేకుండా వన్యప్రాణాలు ఫొటోలు కానీ సెల్ఫీలు కానీ తీసుకుంటే మాత్రం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ఒడిశా అటవీ శాఖ అధికారులు. పర్మిషన్ లేకుండా వన్యప్రాణులతో సెల్ఫీలు తీసుకుంటే ఏడేండ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. జంతువులతోపాటు ఫొటోలు ముఖ్యంగా సెల్ఫీల కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో ఈమధ్య చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత్ నందా ఆదేశాలు జారీ చేశారు.

సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి జంతువులతో సెల్ఫీలు తీసుకుంటున్నారనం..జంతువుల సహాజ ప్రవర్తన, వాటి నివాస పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతేకాదు ఇది 1977 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించడమే అవుతుందని తెలిపారు…