వైన్ షాపుల టెండర్లకు ముహుర్తం ఫిక్స్‌..రెండు రోజుల్లోనే నోటిఫికేషన్‌ !..

వైన్ షాపుల టెండర్లకు ముహుర్తం ఫిక్స్‌..రెండు రోజుల్లోనే నోటిఫికేషన్‌ !

తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపుల టెండర్లకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. రెండు నెలల ముందే వైన్ షాపుల టెండర్లకు సిద్ధమైంది తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ.

2023 – 25 సంవత్సరానికి వైన్‌షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానించేందుకు సిద్ధమైంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. ఇందులో భాగంగానే.. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది సర్కార్‌.

ఈ నెలాఖరులోగా లాటరీ పద్ధతిలో 2620 షాపుల కేటాయింపు చేయనుంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. ప్రస్తుతం ఉన్న వైన్ షాపులకు నవంబర్ వరకు నిర్వహించుకునే అవకాశం ఉంది.