మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికలకి వర్తించదు..!!!

మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికలకి వర్తించదు..


ప్రజాస్వామ్య దేశంలో వివిధ వర్గాలకు చెందిన వారి హక్కులకు భంగం కలిగించేలా ఉండకూడదు. సమాన హక్కులు కలిగి ఉండాలంటే ఈ హక్కులను అమలు చేసే రాజ్యాంగ వేదికల్లో కూడా సమానంగా ప్రాతినిథ్యం ఉండాలి.అయితే ఇక్కడ పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా కనిపించింది.మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్‌ ప్రాధాన్యత సంతరించుకుంది..

చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలనే ఆలోచనకు మూలం గ్రామ పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవుల్లో మూడింట ఒక వంతు (33 శాతం) మహిళలకు కేటాయిస్తూ 1993లో జరిగిన రాజ్యాంగ సవరణ ఈ బిల్లుకు మూలం. మహిళా రిజర్వేషన్ బిల్లును 1996 సెప్టెంబరు 12న అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

సుమారు పాతికేళ్లకుపైగా పెండింగులోనే ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం అనేది దేశ రాజకీయాల్లోనే ఒక కీలక పరిణామం. దీని ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో మోడీ సర్కారు చొరవ తీసుకోవాలని కొన్నాళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్న ప్రతిపక్షాలు కూడా అవుతుందని బిజెపి పై ఒత్తిడి తీసుకురావడంతో క్యాబినెట్ మహిళా బిల్లుకి ఆమోదం తెలిపింది…

అయితే ఇప్పటికీ ఇది చట్ట రూపం దాల్చలేదు
జనగణన పూర్తయిన తరువాత నియోజక వర్గాల విభజన జరిగిన తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తుంది. ఆని
తెలుస్తుంది..