రేపు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రారంభించనున్న మోదీ..

కోల్‌కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశం లోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

గత పదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయికి చేరుకుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది తూర్పు-పశ్చిమ మెట్రో కారిడార్, ఇందులో నది కింద సొరంగం ఉంటుంది.

కోల్‌కతా మెట్రో ప్రాజెక్ట్ యొక్క అనేక దశలలో ఇది ఒకటని ఆయన తెలిపారు…

భారతదేశంలోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈనెల 6న కోల్కతాలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. కోల్కతాలోని రద్దీగా ఉండే ప్రాంతాలను కలిపే ఈ అండర్ రివర్ మెట్రో టన్నెల్ను హుగ్లీ నది కింద నిర్మించారు. అలాగే పట్టణ రవాణాను మార్చే విధంగా దేశవ్యాప్తంగా పలు కీలకమైన మెట్రో, వేగవంతమైన రవాణా ప్రాజెక్టులను రేపు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు..