వరల్డ్ కప్ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..!

భారత్‌ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ చివరి దశకు వచ్చేసింది. తొలి సెమీ ఫైనల్‌లో సత్తా చూపించిన టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరుస విజయాల పరంపరను కొనసాగించి ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 70 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 తుది అంకానికి చేరుకుంది. వ‌రుస విజ‌యాలు సాధిస్తూ టీమ్ఇండియా ఫైన‌ల్‌కు దూసుకువెళ్లింది. ఆదివారం (న‌వంబ‌ర్ 19)న అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచింది. 1,32,000 ఈ స్టేడియం కెపాసిటీ. కాగా.. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌తో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు మ్యాచును వీక్షించేందుకు రానున్నారు.