కోహ్లీ అదిరిపోయే క్యాచ్..

ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సమవుజ్జీల మధ్య మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. అయితే ఆరంభంలోనే ఆసీస్ కు భారీ షాక్ తగిలింది…ఆసీస్ ఇన్నింగ్స్ లో మూడో ఓవర్ ను వేయడానికి జస్ ప్రీత్ బుమ్రా వచ్చాడు. ఆ ఓవర్ రెండో బంతికి ఆసీస్ స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ ను అవుట్ చేశాడు. బుమ్రా వేసిన బంతి లోపలికి రాగా.. చివరి నిమిషంలో మార్ష్ ఆడే ప్రయత్నం చేశాడు.

దాంతో బంతి కాస్తా.. బ్యాట్ ఎడ్జ్ కు తాకి ఫస్ట్ స్లిప్, వికెట్ కీపర్ మధ్యగా వేగంగా వెళ్లింది. ఇక అదే సమయంలో ఫస్ట్ స్లిప్ లో ఉన్న విరాట్ కోహ్లీ తన ఎడం వైపుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు..