నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ విజయం…

భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు తన ప్రస్థానాన్ని గెలుపుతో ఆరంభించింది. నిన్న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టు 81 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ను ఓడించింది..287 పరుగుల లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ ను 205 పరుగులకే పరిమితం చేసింది. పదునైన పాక్ బౌలింగ్ దాడులకు నిలవలేకపోయిన డచ్ జట్టు 41 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3, హసన్ అలీ 2, షహీన్ అఫ్రిది 1, ఇఫ్తికార్ అహ్మద్ 1, మహ్మద్ నవాజ్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు. నెదర్లాండ్స్ జట్టులో ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ (52), బాస్ డీ లీడ్ (67) అర్ధసెంచరీలతో రాణించినా, మిగతా వాళ్లు విఫలమయ్యారు. చివర్లో లోగాన్ వాన్ బీక్ 28 పరుగులు చేయడంతో నెదర్లాండ్స్ స్కోరు 200 మార్కు దాటింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (0) డకౌట్ కావడం డచ్ జట్టు అవకాశాలను దెబ్బతీసింది..