వరల్డ్ కప్ లొ మారో సంచలనం…సౌతాఫ్రికా పై నెదర్లాండ్స్ విజయం.

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాకిచ్చిన అఫ్గానిస్తాన్ ఇచ్చిన స్ఫూర్తితో నెదర్లాండ్స్ జట్టు సఫారీలకూ షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
నెదర్లాండ్స్‌ జట్టు సఫారీలకూ షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నెదర్లాండ్స్‌ నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా జట్టు.. 20 ఓవర్ల లోనే 5 కీలక వికెట్లను కోల్పోయింది. మరో రెండు వికెట్లు పడితే వన్డే వరల్డ్‌ కప్‌ లో రెండో అప్‌సెట్‌ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 21 ఓవర్లు ముగిసేటప్పటికీ ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 94 పరుగులు మాత్రమే చేయగలిగింది.

246 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు టెంబా బవుమా (15), క్వింటన్‌ డికాక్‌ (20) లు తొలి వికెట్‌కు 7.6 ఓవర్లలో 36 పరుగులు జోడించారు. కానీ అకర్‌మన్‌ ఎనిమిదో ఓవర్లో సఫారీలకు తొలి షాకిచ్చాడు. ఆ ఓవర్లో ఆఖరుబంతికి డికాక్‌.. వికెట్‌ కీపర్‌ ఎడ్వర్డ్స్‌కు క్యాచ్‌ ఇచ్చివెనుదిరిగాడు. అనంతరం స్పిన్నర్‌ వాన్‌ డెర్‌ మెర్వ్‌.. తాను వేసిన తొలి ఓవర్లో మొదటి బంతికే బవుమాను బౌల్డ్‌ చేశాడు..

ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (1) కూడా ఓపెనర్ల బాటే పట్టాడు. మార్క్‌రమ్‌ను వాన్‌ మీకెరెన్‌ అద్భుత బంతితో బౌల్డ్‌ చేశాడు. బవుమా వికెట్‌ తీసిన ఊపులోనే వాన్‌ డెర్‌ మెర్వ్‌.. 11.2 వ ఓవర్లో రెండో బంతికి రస్సీ వాన్‌ డెర్‌ డసెన్‌ (4)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. 7.5 ఓవర్లలో 36-0 గా ఉన్న సఫారీ స్కోరు బోర్డు.. నాలుగు ఓవర్ల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 44-4 కు చేరింది.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్‌ క్లాసెన్‌ (28 బంతుల్లో 28, 4 ఫోర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (20 బ్యాటింగ్‌) లు మరో వికెట్‌ పడకుండా నెదర్లాండ్‌ బౌలర్లను అడ్డుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు. అయితే ధాటిగా ఆడుతున్న క్లాసెన్‌ను వాన్‌ బీక్‌.. ఔట్‌ చేయడంతో సఫారీలు ఐదు వికెట్‌ కోల్పోయారు. ప్రస్తుతం మిల్లర్‌తో పాటు మార్కో జాన్సేన్‌ మాత్రమే బ్యాటింగ్‌ చేయగలడు. ఇదే ఊపులో నెదర్లాండ్స్‌ జట్టు మరో రెండు వికెట్లు పడగొడితే కచ్చితంగా ఫలితం మరో విధంగా ఉండనుంది..