పాకిస్తాన్ పై భారత్ విజయం… భారత్ బ్యాటింగ్ , బౌలింగ్ లో ఆధిపత్యం ప్రదర్శన..

ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా మూడో మ్యాచులోనూ విజ‌యం సాధించింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ అగ్ర‌స్థానానికి చేరుకుంది. 192 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమ్ఇండియా 30.3 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ (86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (53 నాటౌట్‌; 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. శుభ్‌మ‌న్ గిల్ (16), విరాట్ కోహ్లీ (16)లు విఫ‌లం అయ్యారు. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు తీశాడు. హసన్ అలీ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.
2023 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌కి బీభత్సమైన హైప్ వచ్చింది. ఇరుజట్ల మధ్య హోరాహోరీ ఫైట్ ఉంటుందని ఎంతో ఆశపడి, భారీగా ఖర్చుపెట్టి స్టేడియానికి వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్…

సిరాజ్‌ మొదలుపెట్టాడు
అసలు విషయమేమిటంటే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ పవర్‌ ప్లే ముగిసేలోపే తొలి వికెట్‌ కోల్పోయింది. ఎనిమిదో ఓవర్‌లో మహ్మద్‌ సిరాజ్‌.. అబ్దుల్లా షఫీక్‌(20)ను అవుట్‌ చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం క్రీజులోకి వచ్చాడు.

ఈ క్రమంలో.. 13వ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా మరో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ పనిపట్టాడు. దీంతో పాక్‌ రెండో వికెట్‌ కోల్పోగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు.

వెయిట్‌ చేయించిన రిజ్వాన్‌
అయితే, క్రీజులోకి వచ్చిన రిజ్వాన్‌.. బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి టైమ్‌ తీసుకున్నాడు. బౌలర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు ఫీల్డర్లను కూడా వెయిట్‌ చేయించాడు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ… ”ఇంకెంత సేపు” అన్నట్లు నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న అంపైర్‌కు ఈ విషయం గురించి చెప్పాడు.