చెట్లు నరుకుతుండగా వింత ఘటన…
ప్రకాశం జిల్లాలో చెట్లు నరుకుతుండగా వింత ఘటన చోటుచేసుకుంది. అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా చెట్టు నుంచి మంచినీళ్లు రావడంతో ఆ వింతను చూడడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను కూడా తాగుతున్నారు..
అందులో నుంచి పాతాళ గంగమ్మ ఉబికి వచ్చింది. ధారాపాతంగా నీళ్లు ఉప్పొంగాయి. ఈ విషయం తెలిసిన వెంటనే తండోపతండాలుగా జనం ఆ చెట్టుకు వద్దకు చేరుకున్నారు. పాతాళ గంగమ్మ కరుణించిందంటూ పూజలు చేశారు..