గిల్ ఔట్‌పై వివాదం…స్టేడియంలోని కొందరు క్రీడాభిమానులు మోసం మోసం అంటూ అరుపులు..!
గిల్ ఔట్‌పై వివాదం, థర్డ్ అంపైర్ నిర్ణయంపై విమర్శల పర్వం..
గిల్ ఔట్‌పై వివాదం, థర్డ్ అంపైర్ నిర్ణయంపై విమర్శల పర్వం…
రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత జట్టుకు థర్డ్ అంపైర్ షాకిచ్చాడు. ఔట్ కాని శుభ్మన్ గిల్ ఔట్ అని ప్రకటించాడు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ వందలాది మంది ట్వీట్ చేస్తున్నారు. ఆగ్రహాన్ని వెళ్ల గక్కుతున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final 2023) ఉత్కంఠభరితంగా మారింది. చివరిరోజు ఆటలో ఇరు జట్లకు విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత్ (India) విజయం సాధించాలంటే చివరి రోజు 280 పరుగులు చేయాల్సి ఉంది. ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా (Australia), భారత్ (India) జట్లలో ఎవరు విజయం సాధిస్తారనేది ఉత్కంఠ భరితంగా మారింది…నాలుగు రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఔట్ వివాదాస్పదంగా మారింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బోలాండ్ 8వ ఓవర్ ప్రారంభించాడు. మొదటి బాల్‌ను ఎదుర్కొన్న గిల్ స్లిప్ క్యాచ్ ఇచ్చాడు. ఆ క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న కామెరాన్ గ్రీన్ అందుకున్నాడు. అయితే, గ్రీన్ క్యాచ్ పట్టే సమయంలో బంతి భూమికి తాకినట్లు కనిపించింది. దీంతో అంపైర్లు థర్డ్ అంపైర్ కు నిర్ణయాన్ని వదిలేశారు. థర్డ్ అంపైర్ పలుసార్లు రిప్లైలో పరిశీలించి గిల్ ఔట్‌గా నిర్ణయించారు. రిప్లైలోనూ బంతి భూమిని తాకుతూ కనిపించింది. అయినా గిల్‌ను ఔట్‌గా ప్రకటించడం పట్ల పలువురు మాజీ క్రికెట్లు తప్పబడుతున్నారు. గిల్ ను ఔట్ గా ప్రకటించడంతో స్టేడియంలోని కొందరు క్రీడాభిమానులు మోసం మోసం అంటూ అరిచారు. సోషల్ మీడియాలో సైతం గిల్ ఔట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…
గ్రీన్ క్యాచ్ పట్టిన విధానాన్ని బట్టిచూస్తే అతను పూర్తిగా బాల్ ను తన చేతుల్లోకి తీసుకున్నట్లు అనిపించింది. రిప్లే తరువాత బాల్ పూర్తిగా చేతిలోకి చేరిందా? లేదా అనేవిషయంపై నాకు ఖచ్చితంగా అర్థంకాలేదని పాంటింగ్ చెప్పారు..
వాస్తవానికి బంతిలో కొంతభాగం నేలను తాకినట్లు నేను భావిస్తున్నాను. బంతి నేలను తాకడానికి ముందు ఫీల్డర్‌కు బంతిపై పూర్తి నియంత్రణ ఉన్నంత వరకు అది ఔట్ అయినట్లు అంపైర్ యొక్క నిర్ణయం. అంపైర్ల నిర్ణయం అదే అయి ఉండాలి. సరిగ్గా అదే జరిగిందని నేను భావిస్తున్నాను అని పాంటింగ్ చెప్పారు.