పేక మేడలా కూలిపోయిన లోయర్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్..
WTC ఫైనల్‌లో మ్యాచ్‌లో భారత్ ఘోరపరాజయం పాలైంది. ఆస్ట్రేలియా జట్టు విధించిన 444 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో విఫలమైన భారత బ్యాటర్లు కేవలం 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఐదో రోజు 280 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఒకే ఓవర్లో కోహ్లీ, జడేజా అవుట్ కావడం.. కొద్ది సేపటికే రహానే కూడా అవుట్ కావడంతో భారత్ గెలుపు అవకాశాలను చేజార్చుకుంది. WTC ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ 43, కోహ్లీ 49, రహానే 46, భరత్ 23, పరుగులు మినహా ఎవరూ రాణించలేకపోయారు. దీంతో 234 పరుగులకు భారత్ ఆలౌట్ అయి ఓటమి పాలైంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 209 పరుగుల తేడాతో గెలిచి టెస్ట్ చాంపియన్‌గా నిలిచింది.