రెండున్నర దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు సఫారీల ఖాతాలో ఐసీసీ ట్రోఫీ..!

సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు 27ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లయ్యింది. రెండున్నర దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు సఫారీల ఖాతాలో ఐసీసీ ట్రోఫీ చేరింది..


ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 లో సెంచూరియన్ ఐడెన్ మార్క్రామ్ అద్భుతమైన 136 పరుగుల ఇన్నింగ్స్ తో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది.

.లార్డ్స్ వేదికగా జరిగిన 2025 డబ్ల్యూటీసీ ఫైనల్లో నెగ్గిన సఫారీ జట్టు టెస్టు ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో ఆసీస్ ను ఢీకొట్టిన సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 282 పరుగుల ఛేదనలో ఎయిడెన్ మర్క్రమ్ అద్భుత సెంచరీతో సఫారీ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ టెంబా బవుమా 66 పరుగులతో రాణించాడు.

ఇక సౌతాఫ్రికా చివరిసారి 1998లో ఐసీసీ టైటిల్ ను ముద్దాడింది. 1998 ఛాంపియన్స్ ట్రోఫీలో నెగ్గిన సౌతాఫ్రికా తొలిసారి ఐసీసీ టోర్నీ విజేతగా నిలిచింది. అప్పటి నుంచి టీ 20, వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో ఆడినా ఓటమే ఎదురయ్యింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రెండో ట్రోఫీని దక్కించుకుంది సౌతాఫ్రికా.

ఈ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ కు నిరాశ మిగిలింది. ఇందులో నెగ్గి వరుసగా రెండోవసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ అవ్వాలని భావించిన ఆస్ట్రేలియాకు భంగపాటే మిగిలింది. తొలి ఇన్నింగ్స్ లో రాణించినా, రెండో ఇన్నింగ్స్ లో బౌలర్లు సహకరించకపోవడం వల్ల ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు..