మినీ ఎలక్ట్రిక్ కారు…సింగిల్ చార్జింగ్ తో 1200 కిలోమీటర్లు..కారు ధర 3.50వేలు..!.

చైనాకు చెందిన ఫస్ట్ ఆటో వర్క్స్ (First Auto Works) అనే సంస్థ మినీ ఎలక్ట్రిక్ వెహికల్ ని రూపొందించింది. ఈ కారు సింగిల్ చార్జింగ్ తో 1200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఈ షావొమా స్మాల్ ఎలక్ట్రిక్ కారు ను ఫస్ట్ ఆటో వర్క్స్ తమ బెస్టూన్ బ్రాండ్ కింద రూపొందించింది. ఈ కారు ప్రి సేల్స్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి. చైనాలో ఈ మినీ ఎలక్ట్రిక్ కారు వూలింగ్ హ్వాంగ్వాంగ్ (Wuling Hongguang) మినీ ఎలక్ట్రిక్ కారుతో పోటీ పడుతుంది.3.47 లక్షలు మాత్రమే.
ఈ ఫస్ట్ ఆటో వర్క్స్ రూపొందించిన బెస్ట్యూన్ కారు ధర భారతీయ కరెన్సీలో రూ. 3.47 లక్షల నుంచి రూ. 5.78 లక్షల వరకు ఉంది. అంటే చైనా కరెన్సీలో 30000 నుంచి 50వేల యువాన్ల మధ్య ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ కారును చైనాలో మాత్రమే లాంచ్ చేశారు. త్వరలో గ్లోబల్ లాంచ్ ఉండబోతోంది. ఈ కారును ఈ ఏప్రిల్ నెలలో జరిగిన షాంఘై ఆటో షోలో తొలిసారి చూపించారు. ఈ ఎలక్ట్రిక్ కారు హార్డ్ టాప్, కన్వర్టబుల్ వేరియంట్లలో లభిస్తుంది. కన్వర్టబుల్ వేరియంట్ ను ఇంకా లాంచ్ చేయలేదు. ఈ కారు సింగిల్ చార్జింగ్ తో 1200 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ చెబుతుంది.

వూలింగ్ హ్వాంగ్వాంగ్ తో పోటీ
ప్రస్తుతం చైనాలో వూలింగ్ హాంగ్వాంగ్ (Wuling Hongguang) మినీ ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లీడర్ గా ఉంది. చిన్న ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్లో ఆ కారుకు ఇప్పుడు చైనాలో పోటీ లేదు ఇప్పుడు. షావోమా బెస్ట్యూన్ కారు దానికి పోటీ ఇవ్వనుంది. షావొమా బెస్ట్యూన్ ఎలక్ట్రిక్ కార్లో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్యుయల్ టోన్ థీమ్ డాష్ బోర్డు ఉన్నాయి. ఇది బాక్సి టైప్ డిజైన్ తో వస్తుంది. ఈ కారుకు స్క్వేర్ హెడ్ లైన్స్, రౌండెడ్ కార్న ర్స్, ఎయిరో డైనమిక్ వీల్స్ దీని ప్రత్యేకత. ప్రత్యేక టెయిల్ ల్యాంప్స్, బంపర్స్ తో కారు వెనకవైపు డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారులో ఈ కారులో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ తో 1200 కిమీలు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఈ కారు డైమెన్షన్స్ 300ఎంఎం పొడవు, 1510 ఎంఎం వెడల్పు, 1630 ఎంఎం ఎత్తు, 1953 ఎంఎం వీల్ బేస్ ఉన్నాయి..