ఇండియాలోకి ‘Xiaomi 13 Pro’.. ఘనంగా లాంచ్ ఈవెంట్..

షియోమీ కంపెనీ నుంచి త్వరలో భారత మార్కెట్లోకి కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. దీని పేరు ‘Xiaomi 13 Pro’. కంపెనీ ఫిబ్రవరి 26న రాత్రి 9:30pm లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. దీనిలో భాగంగా ఫోన్ అధికారికంగా ఇండియాలోకి అడుగుపెట్టనుంది. ఈ స్మార్ట్ ఫోన్ గత డిసెంబర్ నెలలో చైనాలో విడుదల అయింది. అక్కడ ఫోన్ ధర రూ. 61,000 వరకు ఉంది. ఇండియాలో ఇంకా తక్కువ ధరలో లభించే అవకాశం ఉందని సమాచారం.

Xiaomi 13 ప్రో స్పెసిఫికేషన్‌లు (అంచనా)
స్మార్ట్ ఫోన్ 6.73-అంగుళాల 2K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా పనిచేస్తుంది. Android 13, MIUI 14 పై రన్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్‌లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. అలాగే, ప్రత్యేకంగా X-యాక్సిస్ లీనియర్ మోటార్, లేజర్ ఫోకస్ సెన్సార్, IR కంట్రోల్ సెన్సార్ కూడా ఉన్నాయి.

ఫోన్ 120W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌తో 4,820mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉందని సమాచారం. అలాగే, ఇది దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ చేయబడింది. లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా పూర్తి ఫీచర్స్‌ను వెల్లడించనున్నారు.