యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం…

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఇవాళ ఒక్కరోజే రూ.1,09,82000ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గత తెలిపారు. ఇప్పటి వరకు యాదాద్రి చరిత్రలో రూ.కోటి మించి ఆదాయం రాలేదు. యాదాద్రిని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు కార్తీక మాసం కావడంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఈ క్రమంలో ఇవాళ రూ.కోటికిపైగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

వివిధ సేవలు, కౌంటరు విభాగాల ద్వారా ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు…

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం – యాదగిరిగుట్ట,యాదాద్రి..

శ్రీ స్వామి వారి ఆదాయము
రూ1,09,82,446 /-
ప్రధాన బుకింగ్ 3,57,650/-
కైంకర్యములు 10,532/-
సుప్రభాతం 3000/-
వ్రతాలు 13,44,800/-
ప్రచార శాఖ 2,16,500/-
VIP దర్శనం 22,65,000/-
యాదరుషి నిలయం 2,01,332/-
ప్రసాదవిక్రయం 37,36,550/-
పాతగుట్ట. 3,37,650/-
కళ్యాణ కట్ట 1,91,700/-
శాశ్వత పూజలు 42,645/-
వాహన పూజలు 32,500/-
కొండపైకి వాహన ప్రవేశం 10,50,000/-
సువర్ణ పుష్పార్చన 2,83,160/-
వేద ఆశీర్వచనం 16,200/-
శివాలయం 19,300/-
లక్ష్మి పుష్కరిణి -Nil
అన్నదానము 1,78,827/-
లిజేస్ Nil
ఇతరములు Nil
బ్రేక్ దర్శనం 6,95,100/-