యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్రపతి.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునర్నిర్మాణమయ్యాక మొదటిసారిగా వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ పండితులు.

సంకల్పం, సువర్ణపుష్పార్చన పూజల అనంతరం చతుర్వేద ఆశీర్వచనం అందజేసిన ఆలయ పండితులు.

ప్రధాన ఆలయ పరిసరాలను పరిశీలించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

రాష్ట్రపతి రాక సందర్భంగా కొండపై భక్తుల వాహనాలకు అనుమతించడం లేదు. ఇప్పటి వరకు నలుగురు రాష్ట్రపతులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఐదో రాష్ట్రపతిగా నిలిచారు. ఇక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర కళ్లకు కనిపించేలా… దేవస్థానం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రధానాలయ మాఢవీధులోని అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేశారు. ఆలయ చరిత్రను రాష్ట్రపతికి వివరించనున్నారు.. ఆలయ అధికారులు. యాదాద్రి పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనం కానున్నారు.. రాష్ట్రపతి ముర్ము. మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్‌లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, మిలటరీ వారికి విందు ఇవ్వనున్నారు.

రాష్ట్రపతి కి ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు జగదీష్ రెడ్డి..
ఇంద్రకరణ్ రెడ్డి. సత్యవతి రాథోడ్.. విప్ సునీత…. eo గీత..
రాష్ట్రపతి తో పాటు యాదాద్రి కి వచ్చిన గవర్నర్
తమిళి సై సౌదర రాజన్…….

మంగళ వాయిద్యాలతో , పూర్ణకుంభ స్వాగతం పలికిన అర్చకులు….

ఇక ఐదు రోజుల పర్యటన ముగియడంతో సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి ముర్ము ఢిల్లీకి వెళ్లనున్నారు.