యాదగిరీశుడిని దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ….

యాదగిరీశుడిని దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ….
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి భక్తుల సందడి నెలకొన్నది …
ఆదివారం సెలవురోజు మరియు స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని భక్తులు అధికసంఖ్యలో యాదగిరిగుట్టకు చెరుకొని గంటల తరబడి క్యూలైన్లలో వేచియుండి స్వామి వారిని దర్శించుకొని తరించారు…
నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేక పూజలు నిర్వహించిన అర్చకులు… స్వాతి నక్షత్రం సందర్బంగా భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు….
నరసింహస్వామి జన్మనక్షత్రం సందర్బంగా ఆలయ ముఖ మండపంలో శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలతో వేదమంత్రలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయంలో సుమారు ఉత్సవం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వేద పండితులు.. స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో ఆలయ అర్చకులు,అధికారులు పాల్గొన్నారు.. ఈ పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు…