యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది…

యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. మహా సుదర్శన యాగంతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్లు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణ ముహూర్తం చినజీయర్‌స్వామి నిర్ణయించారని, మహా సుదర్శన యాగం కోసం ఐదారువేల రుత్వికులు, యాగానికి 1.5లక్షల లీటర్ల వెయ్యి నెయ్యి అవసరం అని తెలిపారు..మంగళవారం ఉదయం నుంచి యాదాద్రి ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అన్నిరంగాల్లో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ సామాజిక పరమైన నిర్లక్ష్యానికి పరమైన విషయాల్లో కూడా చాలా నిరాధరణ జరిగింది. ఉద్యమ ప్రస్థానంలో పుష్కరాలు పుణ్య నదులైనటువంటి గోదావరి, కృష్ణ, ప్రాణహిత పుష్కరాలు గతంలో నిర్వహించే వారు కాదు.ఉద్యమ సమయంలో గోదావరి పుష్కర శోభను ప్రపంచానికి తెలియజేశాం. స్వరాష్ట్రంలో గోదావరి తీరమంతా వందల సంఖ్యలో ఘాట్లు నిర్మాణం అయ్యాయి. ప్రాణహిత, కృష్ణా తీరాల్లోనూ నిర్మాణాలయ్యాయి. చాలా మహోజ్వలంగా తెలంగాణ పుష్క శోభను యావత్‌ ప్రపంచానికి ప్రసరింపజేసింది. అద్భుతమైన చరిత్ర, గొప్ప సాంస్కృతిక సంపద, గొప్ప చరిత్రను కలిగి ఉన్న ప్రాంతం తెలంగాణ. ఇక్కడ అన్ని రకాల, అన్ని శాఖల ఆధ్యాత్మిక పరిమణాలు అనేక చారిత్రక అవశేషాలను ఈ మధ్య నూతన చరిత్రకారులంతా వెలికి తీసి ప్రపంచానికి తెలిజేస్తున్న విషయం అందరి ముందే ఉంది.
మహోత్కృష్టమైన పుణ్య క్షేత్రాల్లో తెలంగాణలో విశిష్టమైందని, ప్రముఖమైంది స్వయంభుగా వెలసిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. 50 ఏళ్ల కిత్రం బాల్యంలో కుటుంబ పెద్దలతో మెట్లమార్గంలో యాదాద్రికి వచ్చాను. ఆధ్యాత్మిక ఉపాసకులు నడయాడిన ప్రాంతం తెలంగాణ. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి గతంలో ప్రాచుర్యం కల్పించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన కృష్ణా పుష్కరాల్లో జోగులాంబ ఘాట్‌ను నిర్మించాం. పురష్కరాల్లో నేను జోగులాంబ ఘాట్‌లోనే పుణ్యస్నానం ఆచరించాను.పుష్కరాల్లో మంత్రులే వలంటీర్లుగా పని చేశారు. లక్షలాది మంది భక్తులు మళ్లీ ఒకసారి తెలంగాణ ఆధ్యాత్మిక చరిత్రను పుష్కరాల రూపంలో సుసంపన్నం చేయడం జరిగింది. రాష్ట్రం అభివృద్ధిలో పురోగమిస్తున్న క్రమంలో యాదాద్రి ఆలయాన్ని వైభవోతంగా తీర్చిదిద్దేందుకు యాదాద్రికి నాలుగేళ్ల కిందట బీజం వేశాం. మహోత్కృమైన ఆలయాల్లో ప్రముఖమైంది యాదాద్రి అన్నారు. కిషన్‌రావు ఆధ్వర్యంలో యాదాద్రి చాలా గొప్పగా క్షేత్రంగా ఆవిష్కృతమైంది’ అన్నారు..