యాదాద్రి దేవస్థానానికి విదేశి డాలర్ల ద్వారా రూ. 3.15 కోట్లు హుండీ ఆదాయం..

*🔹యాదాద్రి దేవస్థానానికి విదేశి డాలర్ల ద్వారా రూ. 3.15 కోట్లు హుండీ ఆదాయం*

యాదగిరిగుట్టలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి(Laxmi Narasimha Swamy) ఆలయానికి 28 రోజుల పాటు వచ్చిన విదేశి డాలర్ల ద్వారా రూ. 3.15 కోట్ల ఆదాయం (Income) సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామకృష్ణరావు వెల్లడించారు. నాలుగు కిలోల రెండు వందల యాభై గ్రాముల మిశ్రమవెండి వచ్చిందని వివరించారు.

2,006 అమెరికన్‌ డాలర్లు, 110 యూఏఈ దిరామ్స్, 355 ఆస్ట్రేలియా డాలర్స్, 195 కెనడా డాలర్స్‌, 30 సింగపూర్ కరెన్సీ, 155 ఇంగ్లాండ్ డాలర్స్‌, సౌదీ అరేబియా, యూరోప్‌, ఒమన్‌, మలేసియా, నేపాల్‌, ఖతర్‌, థాయిలాండ్‌, న్యూజిలాండ్‌, కువైట్, ఆఫ్రికా, బంగ్లాదేశ్, ఉగాండా, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన కరెన్సీని స్వామివారికి సమర్పించారని ఆయన వెల్లడించారు.