యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భారీగా భక్తులు రాక…

యాదాద్రికి పోటెత్తిన భక్తులు..

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు రద్దీ పెరిగింది. ఆదివారం, కార్తికమాసం కావడంతో యాదగిరిగుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోడానికి పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిల్చున్నారు. దీంతో ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతున్నది..కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలు వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంలేదు.