ప్రమాదకర స్థాయికి నీటి మట్టం..యమునా నది ఉగ్రరూపం…!

గత మూడ్రోజులుగా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యమునా నది(Yamuna River Danger) ఉప్పొంగుతోంది.

దాంతో ఢిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించి, యమునా పరీవాహక ప్రాంతాల్లో నివసించే వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. ఢిల్లీ వద్ద సోమవారం సాయంత్రానికి యమునా నది 205.33 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ మహోగ్రంగా ప్రవహిస్తోంది..

ప్రమాదకర స్థాయికి నీటి మట్టం.. దిల్లీలో టెన్షన్ టెన్షన్

Yamuna River Danger Mark : దేశ రాజధాని దిల్లీలో యమునా నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న హరియాణా నుంచి వరద పోటెత్తడం వల్ల నది నీటిమట్టం ప్రమాదకరస్థాయిని దాటింది. బుధవారం మధ్యాహ్ననికి యుమునా నది నీటిమట్టం 207.55 మీటర్లకు పెరిగింది. దీంతో దిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. ఇంటి నుంచి ప్రజలు బయటకు రావొద్దని కోరింది. అలాగే విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.