యానాం దగ్గర గోదావరిలో వలకు చిక్కిన భారీ పండుగప్ప చేప..15 కేజీల బరువున్న పండుగప్ప చేప వేలం..

యానాం దగ్గర గోదావరిలో వలకు చిక్కిన
భారీ పండుగప్ప చేప..

15 కేజీల బరువున్న పండుగప్ప చేప వేలం

రూ.9 వేలకు సొంతం చేసుకున్న మత్స్యకార దంపతులు

సముద్రపు చేపల రుచులలో రారాజుగా పండుగప్ప

*యానాం-* గౌతమి గోదావరి నదిలో యానాం దగ్గర భారీ పండుగప్ప చేప ఒకటి మత్స్యకారుల వలకు చిక్కింది. సుమారు 15 కేజీల బరువున్న ఈ పండుగప్ప చేపను స్థానిక మార్కెట్ లో వేలం వేయగా రూ.9 వేల ధర పలకింది. మత్స్యకార దంపతులు పోనమండ భద్రం, రత్నంలు దీనిని వేలంలో దక్కించుకున్నారు. సముద్రంతో పాటు అరుదుగా గోదావరిలోనూ వలకు చిక్కే పండుగప్ప చేప రుచి అమోఘమని చెబుతారు.

గోదావరి నదిలో భారీ పండుగప్ప చేపలు దొరకడం అత్యంత అరుదని మత్స్యకారులు తెలిపారు. గతంలో గోదావరిలో 20 కేజీల పండుగప్ప దొరకగా ప్రస్తుతం దొరికిన పండుగప్ప చేప 15 కేజీల బరువు ఉందని మత్స్యకారులు చెప్పారు. ఉప్పు నీటితో పాటు మంచి నీటిలో పెరగడం పండుగప్ప ప్రత్యేకత. ఈ చేప మాంసాహార జీవి అని, మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్లలో చాలావరకు ఈ చేపలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.