హృదయవిదారకమైన తెలుగు ‘హాచికొ’ తరహా కథ..

హృదయవిదారకమైన తెలుగు ‘హాచికొ’ తరహా కథ

కుటుంబ సభ్యులే బంధాలకు, బంధుత్వాలకు విలువనివ్వని రోజులువి. కాని ఓ కుక్క తన యజమాని పట్ల చూపించిన ప్రేమ ప్రస్తుతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై నుండి గోదావరిలోకి దూకి మందాగి కాంచన గల్లంతైయింది. వెంట వచ్చిన యజమాని కనిపించక పోవడంతో ఆమె చెప్పులు వద్దే తిరుగుతూ గోదావరి వైపు చూసి అరుస్తోంది…
యానాం – ఎదుర్లంక బ్రిడ్జి మీద చెప్పులు వదిలి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి. హాలీవుడ్ సినిమా హాచికొ తరహాలో యజమాని కోసం ఆమె చెప్పుల వద్దే తిరుగుతూ అక్కడే ఎదురు చూసిన ఆమె పెంపుడు శునకం.

ఈ క్లూ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు…