ప్రాధమిక ప్రాణాయామ సాధన…

ప్రాధమిక ప్రాణాయామ సాధన.

*ఎటువంటి ప్రాణాయామ సాధనలు చేస్తున్నా, ఏ మంత్ర, తంత్ర, ధ్యాన సాధనలు చేస్తున్నా అవి ఓ యాంత్రిక అలవాటు అవకూడదు. అంటే వాటిని యాంత్రికంగా ఏదో మమ అన్నట్లు గా, ఎరుక లేకుండా చేయకూడదు. ప్రశాంతంగా ఉండి, ఏకాగ్రత గలిగిన మనసుతో, శ్రద్ధగా సాధన చేయాల్సి ఉంటుంది.*

? *ఇటువంటి సాధనలు చేసే వారు తప్పకుండా మాంసాహారం తీసుకోవడం మంచిది కాదు. మధ్యం, పత్తు పదార్థాలు పూర్తిగా మానేయాలి.*

*ఇప్పుడు సాధన గురించి…*

ఒక ప్రశాంతమైన గదిలో గానీ, పార్క్ లో గానీ, ఏదైనా ప్రశాంతత ఉన్న స్థలంలో పద్మాసనం కానీ సిద్దాసనం కానీ, సుఖ ఆసనం కానీ, లేకపోతే కింద కూర్చోలేని వారు కుర్చీలో నిటారుగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని, మన యొక్క రెండు కనుబొమల మధ్య ( భ్రూమధ్యం, మూడో కన్ను) ధారణ చేయాలి. కుడి ముక్కును కుడి బొటనవేలితో మూయాలి.*

? *చాలా తేలికగా ఏ ఇబ్బందీ లేకుండా ఉండేంత వరకు నెమ్మదిగా నెమ్మదిగా ఎడమ ముక్కు తో గాలిని శబ్దం చేయకుండా గాఢంగా పీల్చాలి. ఆ తర్వాత చాలా నెమ్మదిగా అదే ముక్కు ( ఎడమ) రంద్రంతో గాలిని వదలాలి.*

?ఈ విధంగా ఒక పది నుంచి 20 సార్లు చేయండి. ఇది ఒక రౌండ్. జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రాణాయామం లో శబ్దం చేయడం లేదు. నెమ్మదిగా గాఢంగా ఎడమ ముక్కు తో గాలిని లోనికి తీసుకొని అదే ఎడమ ముక్కు తో గాలిని బయటకు వదలడం! అయితే పీల్చిన దాని కంటే వదిలే నిష్పత్తి ఎక్కువగా ఉండేలా చూసుకోండి. శబ్దం చేయకుండా.. నిధానంగా…ఏ ఇబ్బందీ లేకుండా… ప్రశాంతంగా చేయండి. ఎక్కడైనా నొప్పి వస్తే కాసేపు రిలాక్స్ అవచ్చు.

*ఆ తర్వాత ఎడమ ముక్కును కుడి చేతి చిటికెన వేలు తో మూసి, కుడి ముక్కు ద్వారా నెమ్మదిగా నెమ్మదిగా.. గాఢంగా..ఏ ఇబ్బందీ లేకుండా.. ప్రశాంతంగా ‌.. గాలిని పీల్చి…అదే కుడి ముక్కు తో గాలిని బయటకు వదలడం…ఇది కూడా పది నుంచి 20 సార్లు ఒక రౌండ్!*

*బాగా గుర్తు పెట్టుకోండి…*
మనం గాలిని పీల్చడం, వదలడం చేసే సమయంలో ఎటువంటి శబ్దం చేయకూడదు. నెమ్మదిగా తీసుకుని వదలాలి. ఈ సాధనా సమయంలో కళ్ళు మూసుకుని మన యొక్క ఇష్ట దైవాన్ని మనసులో ధ్యానం చేయండి. ఈ సాధన క్రమం తప్పకుండా ప్రతీ రోజూ రెండు పూటలా చేయండి. తొందర పడవద్దు. ఎన్ని సార్లు అయినా చేయవచ్చు కానీ నిదానంగా సాధన చేయడమే ప్రదానం… . మధ్యలో రిలాక్స్ అవచ్చు కూడా. ఈ యొక్క ప్రాణాయామాల ద్వారా డబ్బు మూటలు ఆకాశం నుండి ఊడి పడవు. శారీరక మానసిక రుగ్మతలకు శాశ్వతంగా స్వస్తి చెప్పడం! దాని ద్వారా మనలో పవిత్రమైన ఆలోచనలతో మన యొక్క కార్యాచరణ చక్కగా ఉంటుంది. దాని వల్ల మనం ఐశ్వర్యవంతమైన జీవితం గడుపుతాం.