కృష్ణలంకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..

YS Jagan ఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan Mohan Reddy, విజయవాడ కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. సాయికృష్ణ నివాసానికి చేరుకున్న జగన్, ఆయన తల్లి గాదె విజయలక్ష్మిని కలిసి ఓదార్పు తెలిపారు.

సాయికృష్ణ మరణం చుట్టూ వివాదం నెలకొన్న నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యుల నుంచి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణను లాకప్‌లో కొట్టి చంపారని, అనంతరం మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు చూపకుండా వ్యవహరించారని కుటుంబం ఆరోపిస్తోంది.

అలాగే సాయికృష్ణ మృతదేహాన్ని అర్థరాత్రి సమయంలో దహనం చేయించారంటూ కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్, వారికి ధైర్యం చెబుతూ న్యాయం జరిగేలా పోరాడుతామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.Former Cm Ys Jagan

మరోవైపు తమ కుమారుడు సాయికృష్ణ మిస్సింగ్‌పై తల్లి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాయికృష్ణ బతికి ఉంటే తమకు చూపించాలని, చనిపోయి ఉంటే బూడిదైనా ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులకు వైసీపీ నేతలు అండగా నిలిచారు. సాయికృష్ణ మృతిపై విచారణ జరగాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.

సాయికృష్ణ ఘటనపై సీరియస్.
AP New Capital
మరోవైపు సాయికృష్ణ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐపై వేటు వేశారు. సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.