మళ్లీ సీఎం పెద్ద దొరను ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర.. వైఎస్ షర్మిల..

*BREAKING*

*వైఎస్ షర్మిల*
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

– పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో జర చెప్పు చిన్న దొర…?

– రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసినందుకా?

– స్కీముల పేరిట స్కాములు చేసినందుకా?

– కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకుతిన్నందుకా?

– పాలమూరును కట్టకుండా దక్షిణ తెలంగాణను ఏడాది చేసినందుకా?

– 16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని..4.80లక్షల కోట్ల అప్పులపాలు చేసినందుకా?

– రుణమాఫీ, నిరుద్యోగ భృతి అంటూ మోసం చేసినందుకా?

– వడ్డీ లేని రుణాలు, కార్పొరేషన్ లోన్లు ఇస్తామని దగా చేసినందుకా?

– దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి అంటూ నిండా ముంచినందుకా?

డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు ఇస్తామని కుచ్చుటోపీ పెట్టినందుకా?

– డిస్కంల దివాళా తీసి, ఆర్టీసీని ఆగంజేసి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టినందుకా?

– ఉద్యమకారులను పక్కన పెట్టి, ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్నందుకా?

– జై తెలంగాణ అన్నోడు.. నై తెలంగాణ అంటున్నందుకా?

– తెలంగాణ తల్లికి ద్రోహం చేసి, తెలంగాణ తల్లి విగ్రహం అంటేనే చీదరించుకుంటున్నందుకా?

– కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ తల్లి తల్లడిల్లదు చిన్న దొర.

– మీ తాలిబన్ల పాలనను చూసి, ఎనిమిదేండ్లుగా తెలంగాణ తల్లి తల్లడిల్లుతోంది.

-. దొరల పాలన విముక్తి కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

– మీ నియంత పాలనను మీ ఫామ్ హౌజ్ కే పరిమితం చేయడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉన్నరు.