ప‌రిహారం విడుద‌ల చేయ‌డం పై కేసీఆర్ పై ష‌ర్మిల సెటైర్లు ….

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌రిహారం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ప‌రిహారం విడుద‌ల చేయ‌డం పై కేసీఆర్ పై ష‌ర్మిల సెటైర్లు వేశారు. కేసీఆర్ గారూ.. అంద‌రూ రైతుల‌కు ప‌రిహారం ఇచ్చి.. పాప ప్రక్షాళన చేసుకోవాల‌న్నారు. చనిపోయిన రైతులు ఎందరు? మీరు ఇచ్చే పరిహారం ఎందరికి? ఇప్పటివరకు దాదాపు 7600 మంది రైతులు చనిపోతే 1600 మందికి పరిహారం ఇస్తే సరిపోతుందా? అని ప్ర‌శ్నించారు..మిగతా 6000 మంది పరిస్థితి ఏంటి? చావుల్లో కూడా తేడాలా? ఆ రైతు ఆత్మహత్యలన్నిటికి కారణం మీరు కాదా?పాప ప్రక్షాళన కూడా సరిగా చేసుకోలేరా? అని నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిల‌. ముఖ్యమంత్రికి,మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆగిందిలేదని.. కానీ రైతులు చనిపోతే ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి ఏండ్ల తరబడి ఆగాలి, ఎందుకు? అని నిప్పులు చెరిగారు ష‌ర్మిల. అన్ని రైతు కుటుంబాల‌ను కేసీఆర్ స‌ర్కార్ ఆదుకోవాల్సిందేన‌ని డిమాండ్ చేశారు..