బంగారు తెలంగాణ మాట ఏమోగానీ… బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ మాత్రం అయింది.. వైఎస్ షర్మిల..

బంగారు తెలంగాణ కాదని… బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ అని వైఎస్సార్టీపీ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పెనుబల్లి మండలం పాతకారాయి గూడెం లో వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఉద్యోగాలు రాకపోవడంతో ఎంతో మంది యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆత్మహత్యలకు కారణం నిరుద్యోగమైతే… ఆ నిరుద్యోగానికి కేసీఆర్ కారణమన్నారు. ప్రతి ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కేసీఆర్ సీఎం కాదని, పచ్చి మోసగాడు అని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ తన కుటుంబం కోసమే పని చేస్తున్నారని, ఉద్యోగాలు రాక ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ ను సీఎం ఎందుకు చేశామని ప్రజలు తలలు పట్టుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు…