తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలనే కోరిక……వైఎస్‌ షర్మిల…

తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలనే కోరిక ఉందని.. ఏవిధంగా? ఎప్పుడు? అనే దానిపై చర్చలు జరుపుతున్నామని ఏపీ సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల అన్నారు.

లోటస్‌పాండ్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మిగతా జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నామని.. ఇక్కడే నిర్వహించాలా? జిల్లాలకు తానే వెళ్లి మాట్లాడాలా? అనే దాన్ని నిర్ణయించాల్సి ఉందన్నారు. తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా! రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్నారా? రాజన్న రాజ్యం తేవాలి. జగన్‌మోహన్‌రెడ్డి నా తోడబుట్టిన అన్న. ఆయన ఆశీస్సులు తనపై ఉన్నాయనే అనుకుంటున్నాను. పార్టీ ఇప్పుడే అవసరమని భావిస్తున్నా. నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యా. రాష్ట్రంలో రాజన్న రాజ్యానికి అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. త్వరలో అన్ని జిల్లాల నేతలతో మాట్లాడతా’’ అని షర్మిల అన్నారు…
వైఎస్‌ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం సాధించేందుకు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు వెల్ల‌డైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో షర్మిల ప్రభావం ఎలా ఉంటుందో ఆని అసెక్తిగా ఎదురు చూస్తున్నారు..షర్మిల తెలంగాణాలో నూతన రాజకీయ పార్టీని స్థాపించడానికి నేటి నుంచి మేథోమ‌ధ‌నానికి సిద్ధమ‌య్యారు. పలు ఊహాగానాలు వినిపిస్తున్నా రాజకీయాలలో షర్మిల లాంటి ప్రభావిత వ్యక్తులు రావడం మంచిదే అనుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్ అభిమానులు…