దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ కాళేశ్వరం ప్రాజెక్టు..వైఎస్‌ షర్మిల.

దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ కాళేశ్వరం ప్రాజెక్టు అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం రీడిజైన్ అన్నారు. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు విమర్శలకే పరిమితం అవుతున్నారన్నారు. దేశానికి కాపలా కుక్కలమన్న… కేంద్రమంత్రులు ఎందుకు విచారణ చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘అవినీతి జరిగిందని చెప్పినా ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? మునుగోడు (Munugode)లో జరుగుతోంది వీధి కుక్కల కొట్లాట. అత్యంత ఖరీదైన ఎన్నిక మునుగోడులో జరుగుతోంది. సంతలో పశువుల లెక్క నేతలు అమ్ముడుపోతున్నారు. BRS అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి’’ అని పేర్కొన్నారు.