విమర్శిస్తే బదులివ్వాలి.. దాడులు చేస్తారా?: వైఎస్ విజయమ్మ
వైతెపా అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమార్తెకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ‘‘నా కుమార్తెను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. చూసేందుకు వెళ్తుంటే నన్ను అడ్డుకున్నారు. ఇంటికే తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు. తీసుకొచ్చే వరకు ఇంటి గేటు వద్దే కూర్చుంటా. నా కుమార్తె ఎక్కడా పరుష పదజాలం వాడలేదు. విమర్శిస్తే బదులివ్వాలి కానీ.. దాడులు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లంచుకోక తప్పదు. ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చేయలేరు. మహిళపై దాడి జరిగినప్పుడు ప్రతి నాయకుడు స్పందిస్తారు.. అందులో భాగంగానే బండి సంజయ్ స్పందించారు. నా కుమార్తెకు ఎప్పుడూ అండగా ఉంటా’’ అని విజయమ్మ స్పష్టం చేశారు.
ప్రగతిభవన్ ముట్టడికి కారులో బయల్దేరిన వైఎస్ షర్మిలను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే కారును పోలీసు క్రేన్ వాహనంతో లిఫ్ట్ చేసి తరలించారు. పోలీసుల వైఖరిపై వైతెపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది…
… హైదరాబాద్
Cr. No. 661/2022 u/s 143, 341, 290,506, 509, 336, 353 ,382 r/w 149 IPC of Panjagutta PS….in sharmila కేసు…
***షర్మిల తో పాటు రిమాండ్ కి తరలించిన వారి పేర్లు
ఇందుజా రెడ్డి..
కె. శ్రీను..
ముషారఫ్..
సుధా రాణి..
జాన్..
లాలూ సాహెబ్..
సంజు కుమార్..