ఈనెల 30లోపు కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై డెడ్‌లైన్..లేకుంటే సొంతంగానే బరిలోకి..!. YSషర్మిల..

కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై ఈనెల 30లోపు నిర్ణయం …
తీసుకుంటామని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YSషర్మిల వెల్లడించారు. ఒకవేళ విలీనం లేకుంటే ఈ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగుతామన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కార్యవర్గం సమావేశం నిర్వహించిన షర్మిళ పార్టీ విలీనం, ఎన్నికల వ్యుహంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో 119నియోజకవర్గాల్లో తమ పార్టీ..పోటీ చేసేందుకు సిద్దంగా ఉందని షర్మిల స్పష్టం చేశారు. అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.