నాకు బైనాక్యులర్ గుర్తు వద్దు..షర్మిల..!!

నాకు బైనాక్యులర్ గుర్తు వద్దు!!..

బైనాక్యులర్ గుర్తు కేటాయించడంపై షర్మిల అసంతృప్తి..

వైఎస్సార్టీపీకి ఎన్నికల సంఘం గుర్తు కేటాయించింది. తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు బైనాక్యులర్ గుర్తుపై పోటీ చేస్తారు. షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు ఖరారు చేస్తూ కాసేపటి క్రితం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులందరి ఉమ్మడి గుర్తుగా ఇది ఉంటుంది. అయితే వైఎస్సార్టీపీకి ఇంకా పర్మినెంట్ సింబల్ రాలేదు…

రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న వైయస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పేరా 10బీ కింద అనుమతిస్తూ ఈ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో వైయస్సార్టీపీ అభ్యర్థులకు బైనాక్యులర్ గుర్తును ఉమ్మడిగా కేటాయించింది..
నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఆ పార్టీ అభ్యర్థులకు బైనాక్యులర్ గుర్తును కేటాయించాలని ఎన్నికల సంఘం.. రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. అయితే, ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో మాత్రం ఇతర అభ్యర్థులు ఎంచుకునేలా ఫ్రీ సింబల్స్ జాబితాలో బైనాక్యులర్ గుర్తు అందుబాటులో ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

ఒకవేళ పార్టీ కనీసం 5 శాతం స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోతే మాత్రం ఉమ్మడి గుర్తు అందుబాటులో ఉండదని ఈసీ పేర్కొంది. రాష్ట్రానికి సంబంధించి మరి కొన్ని రిజిస్టర్డ్ పార్టీలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్ముడి గుర్తు కేటాయించింది. ఆజాద్ పార్టీకి సీసీటీవీ కెమెరా గుర్తును, విద్యార్థుల రాజకీయ పార్టీకి బ్యాట్ గుర్తు, జన శంఖారావం పార్టీకి లేడీస్ ఫింగర్ గుర్తును కేటాయించింది…
కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయించడంపై వైఎస్సార్టిపి పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో గుర్తు కేటాయించాలని ఆ పార్టీ అధినేత్రి షర్మిల సీఈసీని ఆశ్రయించారు…